తలలు తెగ్గోయడం ఎలా...?: పాకిస్థాన్ లో బాలికలకు ప్రత్యేక శిక్షణ
- ఫ్రాన్స్ పత్రికలో మహ్మద్ ప్రవక్తపై కార్టూన్లు
- ప్రవక్తను కించపరిచారంటున్న పాక్
- మేక్రాన్ దిష్టిబొమ్మపై బాలికలకు తర్ఫీదు
ఫ్రాన్స్ లో మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా ఓ పత్రికలో కార్టూన్లు పునర్ ముద్రణ కావడం ముస్లిం దేశమైన పాకిస్థాన్ ను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఫ్రెంచ్ పత్రిక వైఖరిపై పాక్ లో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, అక్కడి మత ఛాందసవాద సంస్థలు ఓ అడుగు ముందుకేసి తలలు తెగ్గోయడంలో బాలికలు, యువతులకు శిక్షణ ఇస్తున్నాయి.
పాక్ లోని చాలా మదరసాల్లో ఈ తరహా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పదునైన కత్తితో మనిషి మెడను కోయడం ఎలా అన్న దానిపై నిపుణులు మెళకువలు బోధిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ దిష్టిబొమ్మ తయారుచేయించి దానిపై పీక కోయడం ప్రాక్టీసు చేయించారు. అంతేకాదు, మహ్మద్ ప్రవక్తను అవమానించిన వారి తలలు తెగ్గోయాలంటూ వారితో నినాదాలు కూడా చేయిస్తున్నారు.
కాగా, శిక్షణ పొందుతున్న వారిలో ఓ యువతి స్పందిస్తూ, మహ్మద్ ప్రవక్తను అవహేళన చేసే వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు తాము రక్తం చిందించడానికైనా సిద్ధమేనని స్పష్టం చేసింది.