కరోనా కంటే ఏపీని పట్టి పీడిస్తున్న జగన్ వైరస్ ప్రమాదకరం: చంద్రబాబు

  • నియోజకవర్గ ఇన్ఛార్జీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు
  • అబద్ధాలను నిజాలుగా నమ్మించగల ఘనుడు జగన్ అని వ్యాఖ్య
  • కుల, మత విద్వేషాలను రగిలించడంలో ఆరితేరిపోయారని విమర్శ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ కంటే... అంతకంటే ఎక్కువ పీడిస్తున్న జగన్ వైరస్ ప్రమాదకరమని చెప్పారు. ఈరోజు పార్టీ నాయకులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో 175 నియోజవర్గాలకు చెందిన పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ, కరోనా కంటే జగన్ ప్రమాదకరమని చెప్పారు. ఫేక్ వార్తలను కూడా నిజాలుగా చూపించి, జనాలను నమ్మించగల ఘనుడు జగన్ అని విమర్శించారు. కుల, మత విద్వేషాలను రగిలించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంలో కూడా జగన్ ఆరితేరిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు బురద చల్లడం సాధారణ అంశంగా మారిపోయిందని చెప్పారు.


More Telugu News