ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు దాడికి యత్నించారు: జడ్జి రామకృష్ణ
- అఖిల భారత కుల అసమాన నిర్మూలన పోరాట సమితి బృందంపై దాడికి యత్నించారు
- చిత్తూరు-అనంతపురం జిల్లాల సరిహద్దులో ఈ ఘటన జరిగింది
- దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
వైసీపీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డిపై జడ్జి రామకృష్ణ ఆరోపణలు గుప్పించారు. అఖిల భారత కుల అసమాన నిర్మూలన పోరాట సమితి బృందంపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి యత్నించారని అన్నారు. చిత్తూరు-అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని ములకలచెరువు సమీపంలో దాడికి ప్రయత్నించారని చెప్పారు.
మదనపల్లె ప్రెస్ క్లబ్ లో కుల అసమాన నిర్మూలన పోరాట సమితి బృంద సభ్యులు మీడియా సమావేశాన్ని నిర్మహించారు. తమపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చేసిన దాడులపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఇంతవరకు స్పందించలేదని ఈ సందర్భంగా జడ్జి రామకృష్ణ మండిపడ్డారు. దళితులపై దాడులను నిరసిస్తూ కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సమావేశంలో పోరాట సమితి సౌత్ ఇండియా కన్వీనర్ బండారు లక్ష్మయ్య, ఇతర సభ్యులు పాల్గొన్నారు. సమావేశానంతరం మదనపల్లె నుంచి హైదరాబాదుకు వెళ్తుండగా ఎమ్మెల్యే అనుచరులు దాడికి యత్నించారని ఈ రోజు ఆయన ఆరోపించారు. దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడి యత్నాన్ని పలువురు దళిత నేతలు ఖండించారు.