సైబర్ క్రైమ్ సంయుక్త సీపీ అవినాశ్ మహంతిని కలిసిన ‘దిశ’ తల్లిదండ్రులు
- ఈ నెల 26న విడుదలకానున్న దిశ ఎన్ కౌంటర్ సినిమా
- ‘దిశ’ ఘటన జరిగిన ఆ తేదీనే ఓటీటీ ద్వారా విడుదల
- సినిమాపై దిశ తల్లిదండ్రుల అభ్యంతరాలు
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనల ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన సినిమా ఈ నెల 26న విడుదలకానుంది. ‘దిశ’ ఘటన జరిగిన తేదీనే ఆ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలని రామ్ గోపాల్ వర్మ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమాను నిలిపేయాలని కోరుతూ ఆమె తల్లిదండ్రులు ఈ రోజు సైబర్ క్రైమ్ సంయుక్త సీపీ అవినాశ్ మహంతిని కలిశారు. ఈ సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
కాగా, ఈ సినిమాని నిలిపి వేయాలని కోరుతూ ఆ కేసులోని నిందితుల కుటుంబ సభ్యులు కూడా నిన్న న్యాయ కమిషన్‌ను ఆశ్రయించడం గమనార్హం. పోలీసుల ఎన్‌కౌంటర్‌తో హతమైన నిందితులు శివ, నవీన్, చెన్నకేశవులు, ఆరీఫ్ కుటుంబ సభ్యులు ఈ మేరకు న్యాయ కమిషన్‌కు వినతి పత్రం సమర్పించారు.