తల్లిదండ్రులను ఎత్తుకుని పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొస్తోన్న ఓటర్లు.. వీడియోలు ఇవిగో
- బీహార్ అసెంబ్లీతో పాటు దేశంలోని పలు చోట్ల ఉపఎన్నికలు
- మధ్యప్రదేశ్‌లో చేతుల మీద తల్లిని మోసుకొచ్చిన వ్యక్తి
- హర్యానాలో తండ్రిని తన వీపుపై మోసుకొచ్చిన ఓటరు
బీహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతోన్న ఉప ఎన్నికల్లో ఓటరు చైతన్యం కనపడింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పోలింగ్ కేంద్రంలో ఓ వ్యక్తి తన తల్లిని చేతుల మీద ఎత్తుకొచ్చి ఓటేయించాడు. మధ్యప్రదేశ్‌లో ఈ రోజు మొత్తం 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
హర్యానాలో ఓ వ్యక్తి తన తండ్రిని తన వీపుపై మోసుకుని భైన్స్వాల్ కలాన్ ఓటింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓటు వేయించాడు. కాగా, బీహార్‌లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రోజు ఉదయం 9 గంటలలోపు 8.05 శాతం ఓటింగ్ నమోదయిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయి.