దుబ్బాక ప్రజలారా.. ఒక్క విజ్ఞప్తి: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ ను నేరుగా ఎదుర్కోలేక వెన్నుపోటు రాజకీయాలు
- చెరుకు శ్రీనివాస్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలు
- తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను
- ప్రజలు అనవసర గందరగోళాలకు గురి కావద్దు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఓ వీడియో రూపంలో మాట్లాడుతూ దుబ్బాక ప్రజలారా ఒక్క విజ్ఞప్తి అంటూ అక్కడి ప్రజలకు సందేశమిచ్చారు.
‘దుబ్బాకలో బీజేపీ, టీఆర్ఎస్ లు కాంగ్రెస్ ను నేరుగా ఎదుర్కోలేక వెన్నుపోటు రాజకీయానికి తెర తీశాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలకు తెగబడ్డాయి. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు అనవసర గందరగోళాలకు గురి కావద్దు’ అని రేవంత్ రెడ్డి చెప్పారు.
కాగా, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ‘టీవీ9 బ్రేకింగ్ న్యూస్’ పేరుతో కొందరు నకిలీ వీడియోలు సృష్టించడం కలకలం రేపుతోంది. ఆ వీడియోలకు ‘టీవీ9’ కు ఎలాంటి సంబంధం లేదని ఆ టీవీ ఛానెల్ ఇప్పటికే వివరణ ఇచ్చింది. దీనిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది.