దుబ్బాకలో ప్రారంభమైన ఉప ఎన్నిక పోలింగ్

  • ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన దుబ్బాక స్థానం
  • బరిలో 23 మంది అభ్యర్థులు
  • సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన ఈ స్థానంలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి రామలింగారెడ్డి భార్య సుజాత, బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారు. అయితే, ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

దీనికి తోడు సవాళ్లు, ప్రతిసవాళ్లతో దుబ్బాక వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాగా, ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్న ఓటర్లు బారులుతీరారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు వాటిని 32 సెక్టార్లుగా విభజించారు. ఈ నెల 10న ఓట్లను లెక్కించనున్నారు.


More Telugu News