దక్షిణాసియా అత్యంత ప్రభావశీలుర జాబితాలో టాలీవుడ్ నటి ప్రగతి
- దక్షిణాసియా టాప్ 400 జాబితా వెల్లడి
- జాబితా రూపొందించిన న్యూయార్క్ ప్రెస్, కిరణ్ రాయ్
- కిరణ్ రాయ్ తనను ఇంటర్వ్యూ చేశారన్న ప్రగతి
న్యూయార్క్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ, బ్రిటీష్ పాత్రికేయుడు కిరణ్ రాయ్ సంయుక్తంగా దక్షిణాసియా టాప్ 400 ప్రభావ శీలుర జాబితా రూపొందించారు. కళలు, మీడియా, సంస్కృతి విభాగాల్లో రూపొందించిన ఈ జాబితాలో టాలీవుడ్ క్యారక్టర్ నటి ప్రగతి కూడా చోటు దక్కించుకోవడం విశేషం. దీనిపై ప్రగతి సంతోషం వెలిబుచ్చారు.
ఏఆర్ రెహమాన్, రహత్ ఫతే అలీ కాన్, అద్నాన్ సమీ, జకీర్ హుస్సేన్ వంటి దిగ్గజాలు ఉన్న ఈ జాబితాలో తాను కూడా ఉండడం సంతోషం కలిగిస్తోందని ప్రగతి వెల్లడించారు. ఈ టాప్ 400 జాబితాలో భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ కు చెందినవాళ్లే 230 మంది వరకు ఉన్నారని తెలిపారు. కాగా ఈ జాబితాలో టాలీవుడ్ ఫిలింమేకర్, నటుడు అడవి శేష్ కూడా ఉన్నారు.
ఈ జాబితా రూపొందించే క్రమంలో కిరణ్ రాయ్... జూమ్ యాప్ ద్వారా ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు. కిరణ్ రాయ్ తనను కూడా ఇంటర్వ్యూ చేశారని ప్రగతి ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు.