ఐపీఎల్ లో నేడు ఢిల్లీ వర్సెస్ బెంగళూరు... టాస్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్
- అబుదాబి వేదికగా కీలక మ్యాచ్
- బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
- చెరో ఏడు విజయాలతో ఉన్న ఢిల్లీ, బెంగళూరు
ఐపీఎల్ లో మరికొన్నిరోజుల్లో ప్లేఆఫ్ దశ ప్రారంభం కానుండగా, లీగ్ దశ చివరికొచ్చేసింది. ఇవాళ అబుదాబి వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఇప్పటికే 9 విజయాలతో పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్ అగ్రస్థానంలో ఉండగా, రెండోస్థానం కోసం బెంగళూరు, ఢిల్లీ తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు చెరో 13 మ్యాచ్ లు ఆడి ఏడేసి విజయాలు సాధించాయి. గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరుకుంటుంది.
ఇక, మ్యాచ్ విషయానికొస్తే... ఈ పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం రహానే, అక్షర్, డేనియల్స్ శామ్స్ లకు ఢిల్లీ తుది జట్టులో స్థానం కల్పించారు. బెంగళూరు జట్టులో రెండు మార్పులు జరిగాయి. గుర్ కీరత్ మాన్, నవదీప్ సైనీ స్థానంలో శివం దూబే, షాబాజ్ అహ్మద్ జట్టులోకి వచ్చారు.