ఏపీ జిల్లాల్లో తగ్గుతున్న కరోనా ప్రభావం... 1,916 కొత్త కేసులు, 13 మరణాలు

  • కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 22 కేసులు
  • రాష్ట్రంలో నిదానించిన వైరస్ వ్యాప్తి
  • రాష్ట్రంలో ప్రస్తుతం 22,538 యాక్టివ్ కేసులు
గత కొన్ని నెలలుగా దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు కాస్త నిదానిస్తోంది. ఏపీలోనూ కరోనా వైరస్ ప్రభావం గణనీయంగా పడిపోయింది. గడచిన 24 గంటల్లో 64,581 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,916 కొత్త కేసులు వెల్లడయ్యాయి.

అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 426 కేసులు రాగా, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 22 కేసులు వచ్చాయి. ఇటీవల కాలంలో ఇవే అతి తక్కువ పాజిటివ్ కేసులు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 13 మంది మృతి చెందారు. తాజాగా 3,033 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఓవరాల్ గా ఏపీలో ఇప్పటివరకు 8,27,882 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,98,625 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,538 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 6,719కి చేరింది.


More Telugu News