రాజకీయ సన్యాసం తీసుకుంటాను కానీ.. ఆ పార్టీతో మాత్రం కలవను: మాయావతి

  • బీజేపీ మతతత్వ పార్టీ
  • మాది సర్వజన హితం కోరే పార్టీ
  • మతతత్వ పార్టీలపై మా పోరాటం కొనసాగుతుంది
దేశ రాజకీయాలలో బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఉన్న ఇమేజ్ చాలా ప్రత్యేకమైనది. జాతీయ పార్టీలను ఎదుర్కోవడంలో ఆమెది ఒక ప్రత్యేకమైన శైలి అని చెప్పుకోవచ్చు. తాజాగా ఆమె మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

బీజేపీ అనేది కుల, మత, పెట్టుబడిదారీ సిద్ధాంతాలు కలిగిన పార్టీ అని మండిపడ్డారు. తమది సర్వజన హితం కోరే పార్టీ అని అన్నారు. అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను కానీ బీజేపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితే లేదని చెప్పారు. మతతత్వ పార్టీలపై తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని  అన్నారు. తాను ఎవరి ముందు మోకరిల్లే ప్రసక్తే లేదని చెప్పారు.


More Telugu News