ఇండియాలో మొత్తం కరోనా కేసుల్లో కోలుకున్న వారి సంఖ్య 91.68 శాతం!

  • గణనీయంగా పెరిగిన రికవరీలు
  • తగ్గిన యాక్టివ్ కేసుల సంఖ్య
  • నిన్న 45,230 కొత్త కేసులు
ఎన్నో దేశాలను వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్, ఇండియాలో మాత్రం ఇంకా ప్రారంభం కాకపోవడం కాస్తంత ఊరట కలిగిస్తోంది. నెలన్నర క్రితం రోజుకు దాదాపు లక్ష వరకూ నమోదైన కేసులు, ఇప్పుడు రోజుకు 50 వేల కన్నా తక్కువకు దిగిపోయాయి. ఇదే సమయంలో రికవరీలు గణనీయంగా పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 82 లక్షలను అధిగమించిన వేళ, ప్రస్తుతం కేవలం 5.61 లక్షల మందికి మాత్రమే వివిధ ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోంది. రికవరీ రేటు 91.68 శాతానికి పెరుగగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,83 శాతానికి తగ్గింది.

ఇక గడచిన 24 గంటల వ్యవధిలో 45,230 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,29,313కు చేరింది. ఇదే సమయంలో నిన్న 53,285 మంది కోలుకోగా, మొత్తం 75.44 లక్షల మందికి పైగా కోలుకున్నట్లు అయింది. ఆదివారం నాడు మరో 496 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోగా, మొత్తం మరణాల సంఖ్య 1.22 లక్షలను దాటింది. ఇక నిన్న 8.55 లక్షలకు పైగా కొవిడ్ పరీక్షలు చేశారు.


More Telugu News