మధ్యప్రదేశ్ ప్రొటెం స్పీకర్‌ను చంపేస్తామంటూ సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు

  • ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌కు వ్యతిరేకంగా నిరసన
  • నిరసనను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో ప్రొటెం స్పీకర్ పోస్ట్
  • చంపేస్తామంటూ నిందితుల హెచ్చరిక
మధ్యప్రదేశ్ ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మను చంపేస్తామంటూ సోషల్ మీడియా ద్వారా బెదిరించిన నలుగురిపై భోపాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహ్మద్ ప్రవక్తపై కార్టూన్ల విషయంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వైఖరిని నిరసిస్తూ గురువారం భోపాల్‌లో కొందరు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

దీనిని వ్యతిరేకిస్తూ ప్రొటెం స్పీకర్ నిన్న సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. రామేశ్వర్ పోస్టుపై మండిపడిన కొందరు సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

తనను చంపేస్తామంటూ సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు వచ్చాయని, అసెంబ్లీ సిబ్బంది డీజీపీకి ఫిర్యాదు చేశారని రామేశ్వర్ తెలిపారు. కేసు నమోదు చేశామని, ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తించనున్నట్టు క్రైం బ్రాంచ్ ఏఎస్పీ గోపాల్ ధకడ్ చెప్పారు. నిందితులైన ఎ.ఖాన్, ముహమ్మద్ కలీమ్, జావేద్ అక్తర్‌‌ల ఐపీ అడ్రస్ తెలియదని, అలాగే, మరో గుర్తు తెలియని నిందితుడు ఉన్నాడని పోలీసులు తెలిపారు.


More Telugu News