సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • ఎంతో మార్పు వచ్చిందంటున్న రకుల్ 
  • జనవరి నుంచి వెంకీ, వరుణ్ ల 'ఎఫ్ 3'
  • విజయ్ టీవీకి మహేశ్ కొత్త చిత్రం రైట్స్
  • సంక్రాంతికి పక్కాగా వస్తున్న రామ్ 'రెడ్'
*  'వేగన్' (పూర్తి శాకాహారి.. పాలు వంటి జంతు సంబంధిత ఆహారం సైతం తీసుకోకపోవడం)గా మారాక తనలో ఎంతో మార్పు కనిపిస్తోందని అంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. "ఏడాది క్రితం ఎందుకో ఉన్నట్టుండి మాంసాహారం తినబుద్ధి కాలేదు. దాంతో మానేశాను. అప్పుడు మెడిటేషన్ చేస్తుంటే నాలో నాకే ఎంతో మార్పు కనిపించింది. దాంతో వేగన్ గా మారిపోయాను. ఇప్పుడు శరీరం ఎందుకో హాయిగా ఉన్నట్టు వుంది" అని చెప్పింది రకుల్.
*  అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన హిట్ చిత్రం 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా 'ఎఫ్ 3' చిత్రాన్ని రూపొందించే పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పని జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగును వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభిస్తారు. ఇందులో కూడా వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తారు.
*  మహేశ్ బాబు, పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' చిత్రం తమిళ వెర్షన్ కు సంబంధించిన శాటిలైట్, డిజిటల్ హక్కులను విజయ్ టీవీ సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ మొత్తాన్ని సదరు ఛానెల్ ఆఫర్ చేసిందట.  
*  'ఇస్మార్ట్ శంకర్' విజయం తర్వాత రామ్ నటిస్తున్న చిత్రం 'రెడ్'. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్ణయించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.


More Telugu News