గిల్గిత్-బాల్టిస్థాన్‌కు ప్రావిన్షియల్ హోదా.. ఖండించిన భారత్
- ఇమ్రాన్ ప్రకటనపై భారత్ మండిపాటు
- మానవ హక్కులను హరిస్తోందని ఆగ్రహం
- గిల్గిట్-బాల్టిస్థాన్ భారత అంతర్భాగమన్న శ్రీవాస్తవ
గిల్గిత్-బాల్టిస్థాన్‌కు తాత్కాలిక ప్రావిన్షియల్ హోదా కల్పిస్తూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటనను భారత్ ఖండించింది. జమ్మూకశ్మీర్, లడఖ్‌తోపాటు గిల్గిత్-బాల్టిస్థాన్ కూడా భారత్‌లో అంతర్భాగమేనని తెగేసి చెప్పింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ప్రకటన చట్ట విరుద్ధమన్నారు. చట్టవిరుద్ధంగా, బలవంతంగా ఆక్రమించిన ప్రాంతాలపై ఆ దేశానికి ఎలాంటి అధికారం ఉండబోదన్నారు.
పాక్ ప్రకటన ఆ ప్రాంతంలో ఏడు దశాబ్దాలుగా నివసిస్తున్న వారి మానవ హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. మానవ హక్కులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ, దోపిడీ, స్వేచ్ఛను హరిస్తున్న పాకిస్థాన్ ఇలాంటి ప్రకటనలతో అసలు నిజాలను దాచలేదన్నారు. దురాక్రమణలకు స్వస్తి చెప్పి ఆక్రమిత ప్రాంతాలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని అనురాగ్ హెచ్చరించారు.