బీజేపీని ఓడించలేరని ఎవరు చెప్పారు?: చిదంబరం

  • బీజేపీ అజేయమమైన పార్టీ కాదన్న చిదంబరం
  • ప్రతిపక్షాలు గట్టిగా నమ్మాలని సూచన
  • బీహార్ ఎన్నికలతో బీజేపీ ఏపాటిదో తేలుతుందన్న కాంగ్రెస్ నేత
బీజేపీని ఓడించగలమని ప్రతిపక్షాలు గట్టిగా నమ్మాలని, బీజేపీ ఓడించనలవిగాని పార్టీ ఏమీ కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. బీజేపీ అజేయమైన పార్టీ కాదని రాబోయే బీహార్ ఎన్నికలు నిరూపిస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత దేశంలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలను గమనిస్తే బీజేపీ విజయాల శాతం దారుణంగా పడిపోయిన విషయం వెల్లడవుతుందని అన్నారు.

వివిధ రాష్ట్రాల్లోని 381 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలు, వాటి ఫలితాలు పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుందని అన్నారు. 2019లో 330 స్థానాల్లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు, 51 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ అభ్యర్థులు 319 స్థానాల్లో గెలిచారని చెప్పారు. కానీ 2019 తర్వాత బీజేపీ నేతలు అవే 381 అసెంబ్లీ స్థానాల్లో 163 స్థానాల్లో మాత్రమే గెలిచారని చిదంబరం వివరించారు. "ఎవరు చెప్పారు బీజేపీని ఓడించలేరని? గెలవగలమన్న నమ్మకం ముఖ్యం" అని వ్యాఖ్యానించారు.


More Telugu News