సింథియాను నేను 'కుక్క' అనలేదు... అందుకు అశోక్ నగర్ ప్రజలే సాక్ష్యం: కమల్ నాథ్

  • కమల్ నాథ్ తనను కుక్క అన్నారంటూ సింథియా ఆరోపణ
  • నేను ఎవరినీ దూషించలేదు అంటూ కమల్ నాథ్ స్పష్టీకరణ
  • ఇటీవలే మంత్రి ఇమార్తి దేవిని 'ఐటమ్' అని పిలిచిన కమల్ నాథ్
కాంగ్రెస్ నేత కమల్ నాథ్ తనను 'కుక్క' అన్నారని, అవును నేను కుక్కనే.. అయితే ఏంటి? అంటూ బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింథియా ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. దీనిపై కమల్ నాథ్ వివరణ ఇచ్చారు. సింథియాను తాను 'కుక్క' అనలేదని, అందుకు మధ్యప్రదేశ్ లోని అశోక్ నగర్ ప్రజలే సాక్ష్యం అని స్పష్టం చేశారు. అశోక్ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తాను ఎవరినీ దూషించలేదని అన్నారు.

"అశోక్ నగర్ లో నేను తనను 'కుక్క' అని సంబోధించానని సింథియా అంటున్నారు. అతన్ని ఎప్పుడూ ఆ విధంగా పిలవలేదు. కావాలంటే అశోక్ నగర్ ప్రజలను అడగండి" అని అన్నారు.

కమల్ నాథ్ మీడియా వ్యవహారాల సమన్వయకర్త నరేంద్ర సలూజా కూడా ఇదే విషయం ఉద్ఘాటించారు. మాజీ సీఎం కమల్ నాథ్ అలాంటి మాటలు మాట్లాడలేదని అన్నారు. సింథియానే కాదు, మరే ఇతర నాయకుడ్ని ఆయన తిట్టలేదని పేర్కొన్నారు. కమల్ నాథ్ ప్రసంగాల్లో 'కుక్క' అనే మాట రానేలేదని వివరణ ఇచ్చారు. ఇటీవలే కమల్ నాథ్ మధ్యప్రదేశ్ మహిళా మంత్రి ఇమార్తి దేవిని 'ఐటమ్' అని అభివర్ణించిన సంగతి తెలిసిందే.


More Telugu News