మా పెళ్లిలో తెలుగు సంప్రదాయాన్ని కూడా పాటించాం: కాజల్ అగర్వాల్

  • గౌతమ్ కిచ్లూతో కాజల్ పెళ్లి
  • ముంబయిలో ఘనంగా వివాహం
  • జీలకర్ర-బెల్లంపై వివరణ ఇచ్చిన కాజల్
ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వివాహం వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో నిన్న ముంబయిలో జరిగింది. తన వివాహంపై కాజల్ అగర్వాల్ అభిమానులకు వివరించింది. తమ పెళ్లిలో తెలుగు సంప్రదాయాన్ని కూడా పాటించామని చెప్పింది. తమ వివాహం సందర్భంగా జీలకర్ర-బెల్లం కూడా తలపై పెట్టుకున్నామని వివరించింది.

"ఓ పంజాబీ వచ్చి ఓ కశ్మీరీని వివాహం చేసుకుంది. అయితే గౌతమ్ కు, నాకు దక్షిణ భారతదేశంతో ఎంతో అనుబంధం ఉంది. తెలుగు సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్లలో జీలకర్ర-బెల్లం చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ ప్రక్రియ ద్వారానే వధూవరులు ఒక్కటవుతారు. జీలకర్ర,బెల్లాన్ని ముద్దలా చేసి తమలపాకుపై ఉంచి ముహూర్త సమయానికి వేదమంత్రాల నడుమ ఒకరి తలపై ఒకరు పెట్టుకుంటారు. ఆ తర్వాతే పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఒకరిని ఒకరు చూసుకుంటారు. కష్టసుఖాల్లోనూ కలిసి ఉంటారని చెప్పేందుకు ఈ తంతు" అంటూ కాజల్ తెలిపారు.


More Telugu News