నిర్మల సీతారామన్ పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి
- నిర్మలది విభిన్నమైన మనస్తత్వం అని వెల్లడి
- పట్టుబట్టి తనను బదిలీ చేయించారని ఆరోపణ
- వీఆర్ఎస్ తో పదవీవిరమణ చేసిన సుభాష్ చంద్ర గార్గ్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ పై కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన మూడు వారాల్లోనే సుభాష్ చంద్రను ఆర్థికశాఖ నుంచి బదిలీ చేశారు. తన బదిలీని నిరసిస్తూ ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తాజాగా ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. నిర్మల సీతారామన్ తనను పట్టుబట్టి బదిలీ చేయించారని ఆరోపించారు.
నిర్మల సీతారామన్ కు ఆమె కంటే ముందు ఆర్థికమంత్రిగా చేసిన అరుణ్ జైట్లీకి ఎంతో తేడా ఉందని, నిర్మల వ్యక్తిత్వం భిన్నమైనదని వెల్లడించారు. తన పదవీకాలంలో నిర్మల సీతారామన్ తో ఎప్పుడూ మంచి సంబంధాలు కొనసాగించలేకపోయానని పేర్కొన్నారు. ఆమె ఆర్థికమంత్రిగా వచ్చేటప్పుడే తన పట్ల ఏవో పూర్వభావనలతో వచ్చారని సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు.
"ఆమె నన్ను ఎప్పుడూ నమ్మింది లేదు. నాతో పనిచేయాలంటేనే ఆమె ఎంతో అసౌకర్యంగా భావించేవారు. ఆర్థిక రంగ అంశాలపై కీలక నిర్ణయాల నేపథ్యంలో వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ నిర్మలతో సంబంధాలు క్షీణించాయి. ఆమే స్వయంగా నన్ను ట్రాన్స్ ఫర్ చేయించారు. అప్పటికి ఆమె ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టి నెలరోజులే" అని వివరించారు.