లవ్ జిహాద్ కు పాల్పడేవారు తీరు మార్చుకోవాలి... లేకపోతే వారి అంతిమయాత్ర ప్రారంభమైనట్టే!: యోగి ఆదిత్యనాథ్

  • పెళ్లి కోసం మతమార్పిడి చెల్లదన్న అలహాబాద్ హైకోర్టు
  • లవ్ జిహాద్ అణచివేతకు చట్టం తెస్తామన్న యోగి
  • లవ్ జిహాద్ పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టీకరణ
కేవలం పెళ్లి కోసమే మతమార్పిడి చేయడం చెల్లదని, పెళ్లికి మతమార్పిడి అవసరంలేదని అలహాబాద్ హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. లవ్ జిహాద్ అణచివేసేందుకు ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. అందుకోసం కఠినచట్టం తీసుకువస్తామని ఉద్ఘాటించారు.  తమ గుర్తింపును దాచిపెట్టి హిందూ మహిళల గౌరవంతో ఆటలాడేవారు ఇకపై తమ పంథాను మార్చుకుంటే బాగుంటుందని హితవు పలికారు.

"మా సోదరీమణుల జీవితాలను భగ్నం చేసేవారు తమ తీరు మార్చుకోవాలి. లేకపోతే వారి 'రామ్ నామ్ సత్య యాత్ర' (అంతిమయాత్ర) ప్రారంభం అవుతుంది" అని హెచ్చరించారు. మల్హానీ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండగా, తమ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహిస్తూ సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News