'కలర్ ఫొటో' సినిమాతో నా కల నెరవేరింది: సునీల్

  • విజయవంతమైన 'కలర్ ఫొటో' చిత్రం
  • విలన్ పాత్రలో నటించిన హాస్యనటుడు 
  • విలన్ అవుదామనే సినిమాల్లోకి వచ్చానన్న సునీల్
ఇలీవలే ఓటీటీలో విడుదలైన 'కలర్ ఫొటో' సినిమా ప్రేక్షకాదరణ పొందింది. తక్కువ బడ్జెట్ తో చిన్న నటులు, కొత్త నటులతో తెరకెక్కించినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు, సినీ ప్రముఖుల ప్రశంసలను సైతం పొందుతోంది. తొలి వారంలో తమ చిత్రాన్ని 7 లక్షల మంది వీక్షించారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించింది.

ఈ సినిమాలో ప్రముఖ నటుడు సునీల్ విలన్ పాత్రను పోషించడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంలో అందరూ యంగ్ స్టర్స్ నటించారని, వారితో కలిసి పని చేయడం చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. అందరూ తనను ఎంతో బాగా చూసుకున్నారని అన్నారు. వాళ్లు చెప్పినట్టే తాను నటించానని తెలిపారు. సినిమా చూసిన వారంతా... కొట్టకుండా, తిట్టకుండా భలే భయపెట్టావ్ భయ్యా అని ఫోన్ చేసి చెపుతుంటే... సినిమాతో పాటు, తన పాత్ర హిట్ అయిందని తనకు అర్థమయిందని చెప్పారు.

విలన్ అవుదామనే తాను ఇండస్ట్రీకీ వచ్చానని, ఈ సినిమాతో తన కోరిక తీరిందని సునీల్ అన్నారు. సినిమాలో అందరూ అద్భుతంగా నటించారని ప్రశంసించారు. సందీప్ రాజ్ కొత్త దర్శకుడు అయినప్పటికీ గొప్పగా తెరకెక్కించాడని కితాబిచ్చారు.


More Telugu News