బీజేపీ ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీపై ఈసీ స్పందన

  • రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించడం సాధారణం
  • సంక్షేమ పథకాన్ని ప్రకటించడంలో తప్పు లేదు
  • బీజేపీ హామీలో మాకు ఏ తప్పూ కనిపించలేదు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ బీజేపీ హామీ ఇవ్వడం దేశ వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారి తీసింది. ఎన్నికలు ఉండే రాష్ట్రాలకు మాత్రమే ఉచిత వ్యాక్సిన్ ఇస్తారా? అని విపక్షాలు మండిపడ్డాయి. ఇతర రాష్ట్రాల్లోని ప్రజలకు వ్యాక్సిన్ అవసరం లేదా? అని మండిపడ్డాయి. మరోవైపు ఎన్నికల సమయంలో హామీని ఇవ్వడం ద్వారా ఎన్నికల కోడ్ ను బీజేపీని ఉల్లంఘించిందంటూ ఈసీకి ఆర్టీఐ యాక్టివిస్ట్ సాకేత్ గోఖలే ఫిర్యాదు చేశారు.

దీనిపై ఈసీ స్పందిస్తూ, ఎన్నికల కోడ్ ను బీజేపీ ఉల్లంఘించలేదని తెలిపింది. ప్రజలకు సంక్షేమ పథకాన్ని ప్రకటించడంలో ఎలాంటి తప్పు లేదని వ్యాఖ్యానించింది. ఎన్నికలకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మేనిఫెస్టోలు ప్రకటించడం సాధారణ అంశమేనని తెలిపింది. బీజేపీ హామీలో తమకు ఎలాంటి తప్పు కనిపించలేదని స్పష్టం చేసింది.


More Telugu News