2018లో ఏపీకి 9వ ర్యాంకు... ఇప్పుడు 3వ స్థానం: విజయసాయిరెడ్డి

  • సుపరిపాలన ర్యాంకులు విడుదల చేసిన పీఏసీ
  • మూడోస్థానంలో నిలిచిన ఏపీ
  • సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి
ఇస్రో మాజీ చైర్మన్ కె.కస్తూరిరంగన్ నేతృత్వంలోని పబ్లిక్ అఫైర్స్ సెంటర్ (పీఏసీ) స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన సుపరిపాలన ర్యాంకుల్లో ఏపీకి మూడో స్థానం లభించిన సంగతి తెలిసిందే.  దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 2018లో 9వ ర్యాంకులో ఉన్న ఏపీ 3వ ర్యాంకుకు ఎగబాకిందని తెలిపారు. అందుకు మన గౌరవనీయ ముఖ్యమంత్రి  జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని విజయసాయి ట్వీట్ చేశారు.

పీఏసీ సంస్థ జాతీయస్థాయిలో పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో వేర్వేరుగా సుపరిపాలన జాబితాలు రూపొందించింది. పెద్ద రాష్ట్రాల్లో కేరళ, చిన్న రాష్ట్రాల్లో గోవా, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చండీగఢ్ ప్రథమస్థానాల్లో నిలిచాయి.


More Telugu News