నిధుల విషయమై.. ప్రధాని మోదీకి లేఖ రాసిన జగన్

  • పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏడు పేజీల లేఖ
  • నిధుల విషయంలో జోక్యం చేసుకోవాలని విన్నపం
  • ఆలస్యమయ్యేకొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని వ్యాఖ్య
పోలవరం ప్రాజెక్టు నిధుల్లో కేంద్ర ప్రభుత్వం దారుణంగా కోత విధించడంపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర జలశక్తి మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రిలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఏడు పేజీల లేఖను రాశారు. ప్రాజెక్టు నిధుల విషయంలో జోక్యం చేసుకోవాలని లేఖలో సీఎం కోరారు.

భూసేకరణ, పునరావాస చర్యలకు కూడా నిధులను ఇవ్వాలంటూ 2014 ఏప్రిల్ 29న కేబినెట్ చేసిన తీర్మానాన్ని లేఖలో ప్రస్తావించారు. ఆలస్యమయ్యే కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని పేర్కొన్నారు. ఆంధ్రులకు జీవనాడి అయిన పోలవరంను పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని ముఖ్యమంత్రి అన్నారు.


More Telugu News