టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి... అప్పుడే రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

  • దుబాయ్ లో ఢిల్లీ వర్సెస్ ముంబయి  
  • మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్
  • 3 ఓవర్లలో 2 వికెట్లకు 15 పరుగులు
ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. మరో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇక, దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్ లో ముంబయి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

అయితే ఢిల్లీ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ శిఖర్ ధావన్ వికెట్ చేజార్చుకుంది. ధావన్ డకౌట్ అయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో బ్యాక్ వర్డ్ పాయింట్ లో సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే పృథ్వీ షా కూడా పెవిలియన్ బాటపట్టాడు. 10 పరుగులు చేసిన పృథ్వీ షా కూడా బౌల్ట్ కే వికెట్ అప్పగించాడు. దాంతో 3 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టులో  మూడు మార్పులు జరిగాయి. ప్రవీణ్ దూబే ఐపీఎల్ అరంగేట్రం చేస్తుండగా, పృథ్వీ షా, హర్షల్ పటేల్ మళ్లీ జట్టులోకి వచ్చారు. ముంబయి జట్టులో హార్దిక్ పాండ్య, జేమ్స్ ప్యాటిన్సన్ కు విశ్రాంతి కల్పించారు. వారి స్థానంలో జయంత్ యాదవ్, నాథన్ కౌల్టర్ నైల్ బరిలో దిగుతారు.


More Telugu News