ప్రజల ఉసురు తప్పక తగులుతుంది: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్
- వైఎస్సార్ సీఎంగా ఉండగా జలయజ్ఞం ప్రాజెక్టులకు ఆటంకాలు
- ఇప్పుడు సీమ ఎత్తిపోతల పథకాలకు బ్రేకులు వేసే కుట్రలు
- ట్రైబ్యునల్స్, కోర్టుల్లో కేసులు
- అనుమతులను అడ్డుకోవాలని యత్నాలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పలు ఆరోపణలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి స్పందిస్తూ చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు ఆటంకాలు కల్పిస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు.
‘గతంలో మహానేత వైఎస్సార్ సీఎంగా ఉండగా జలయజ్ఞం ప్రాజెక్టులకు ఆటంకాలు కల్పించినట్టుగానే సీమ ఎత్తిపోతల పథకాలకు బ్రేకులు వేసే కుట్రలు మొదలు పెట్టాడు చంద్రబాబు. ట్రైబ్యునల్స్, కోర్టుల్లో కేసులు వేయించి అనుమతులను అడ్డుకోవాలని చూస్తే ప్రజల ఉసురు తప్పక తగులుతుంది’ అని విజయసాయిరెడ్డి చెప్పారు.