నేవీ అమ్ముల పొదిలో మరో విధ్వంసక క్షిపణి.. విజయవంతమైన పరీక్ష
- ఐఎన్ఎస్ కోరా నుంచి క్షిపణి పరీక్ష
- లక్ష్యాన్ని తుత్తునియలు చేసిన మిసైల్
- ఇటీవల వరుసపెట్టి పరీక్షలు నిర్వహిస్తున్న భారత్
భారత నౌకాదళ అమ్ములపొదిలో మరో విధ్వంసక క్షిపణి చేరింది. తూర్పు నౌకాదళ పరిధిలోని బంగాళాఖాతంలో యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ కోరా’ నుంచి జరిపిన నౌకా విధ్వంస క్షిపణి (యాంటీ షిప్ మిసైల్) పరీక్ష విజయవంతమైనట్టు నావికాదళం ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇది గరిష్ఠ దూరంలోని లక్ష్యాన్ని సమర్థవంతంగా, పూర్తి కచ్చితత్వంతో ఛేదించిందని, లక్ష్య నౌక ధ్వంసమైందని పేర్కొంది. ఈ మేరకు వీడియోను పోస్టు చేసింది.
భారత్ గత కొన్ని రోజులుగా వరుసపెట్టి క్షిపణి పరీక్షలు చేస్తోంది. అరేబియా సముద్రంలో యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ ప్రబల్’ నుంచి నిర్వహించిన యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతమైంది. అలాగే, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్, అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన శౌర్య సూపర్ సోనిక్ క్షిపణితోపాటు ఒడిశా తీరంలోని వీలర్ ఐలండ్‌లో ఏపీజే అబ్దుల్ కలాం లాంచ్ కాంప్లెక్స్ నుంచి హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ వెహికల్‌ను విజయవంతంగా లాంచ్ చేసింది.