ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
- దుబాయ్ వేదికగా మ్యాచ్
- రాజ్ పుత్ స్థానంలో వరుణ్ ఆరోన్ ను తీసుకున్న రాజస్థాన్
ఐపీఎల్ పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. మరికొన్ని రోజుల్లో ప్లేఆఫ్ దశ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రతి మ్యాచ్ కీలకమే. నేటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడనుంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో విజయం ఇరుజట్లకు ఎంతో అవసరం. అందుకే పోరు హోరాహోరీగా ఉంటుందనడంలో సందేహంలేదు.
కేఎల్ రాహుల్ నాయకత్వంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మాంచి ఊపుమీద ఉంది. విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ రాకతో ఆ జట్టు భాగ్యరేఖ మారిపోయింది. వరుస విజయాలతో మోత మోగిస్తోంది. మరోవైపు రాజస్థాన్ జట్టులో నిలకడ లోపించింది. దాని ఫలితమే ఇప్పటికీ ప్లేఆఫ్ బెర్తుపై స్పష్టత రాలేదు. ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తప్పదనిపిస్తోంది.
పంజాబ్ జట్టులో ఎలాంటి మార్పులు లేకపోగా, రాజస్థాన్ ఒక మార్పుతో బరిలో దిగుతోంది. గత మ్యాచ్ లో ధారాళంగా పరుగులిచ్చిన అంకిత్ రాజ్ పుత్ స్థానంలో వరుణ్ ఆరోన్ జట్టులోకి వచ్చాడు.