సింగరేణి బొగ్గు గనిలో కూలిన పైకప్పు.. చిక్కుకున్న ఓవర్‌మన్ కోసం గాలింపు
- పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్జీ-2లో ప్రమాదం
- బండ కింద కూరుకుపోయిన నవీన్ కుమార్
- తప్పించుకున్న మరో ఐదుగురు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్జీ-2 పరిధిలోని వకీల్‌పల్లి గనిలో పైకప్పు కూలిన ఘటనలో పనులు పర్యవేక్షిస్తున్న ఓవర్‌మన్ రాపోలు నవీన్‌కుమార్(28) చిక్కుకుపోయారు. ఈ ప్రమాదం నుంచి మరికొందరు తప్పించుకున్నారు. బొగ్గు పొరల కింద కూరుకుపోయిన నవీన్ కుమార్ కోసం గాలిస్తున్నారు.
ఎస్‌డీఎల్ తాత్కాలిక ఆపరేటర్ కలవేణి సతీశ్ (31) ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. స్వల్పంగా గాయపడిన ఆయనను వెంటనే సింగరేణి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న మరో ఐదుగురు తప్పించుకున్నారు. మరికాసేపట్లో విధులు ముగుస్తాయనగా ప్రమాదం జరిగింది. కాగా, కూలిన బొగ్గు బండ మందం 1.8 మీటర్లు ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. దానిని తొలగించేందుకు అధికారులు రాత్రి వరకు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది.