ఎట్టెట్ట అచ్చెన్నా.. లోకేశ్‌ని మించిపోతున్నావ్ గా?: విజయసాయిరెడ్డి

  • స్థానిక ఎన్నికల నిర్వహణపై సెటైర్లు
  • ఎన్నికలు వాయిదా వేసినప్పుడు కేసులు ఎక్కువున్నాయా? అని ప్రశ్న
  • ఏం నాలెడ్జ్? అంటూ సెటైర్లు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచింది. ఎన్నికలు నిర్వహించాలని విపక్షాలు కోరుతుండగా, అధికార వైసీపీ మాత్రం వద్దంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.

 'ఎట్టెట్ట అచ్చన్నా... పంచాయితీ ఎన్నికలు వాయిదా వేసినప్పుడు (మార్చిలో) కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు తగ్గిపోయాయా? అడ్డెడ్డె ఏం అవగాహన? ఏం నాలెడ్జ్? చిట్టిబాబు లోకేశంని మించిపోతున్నావ్ గా? అందుకే చాలాకాలం క్రితం జగన్ గారు తమరికి బుర్ర పెంచుకోమని సలహానిచ్చింది. చెప్తే వినవూ?' అంటూ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.


More Telugu News