మద్యం ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం

  • రూ. 50 నుంచి రూ. 1350 వరకు తగ్గిన ధరలు
  • బీర్లు, రెడీ టు డ్రింక్ మద్యం ధరలు యథాతథం
  • రూ. 200 లోపు క్వార్టర్ రేటు కూడా యథాతథం
పెంచిన మద్యం ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించింది. ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ తో పాటు, విదేశీ మద్యంలోని మధ్య, ఉన్నత శ్రేణి బ్రాండ్లపై ధరలను తగ్గిస్తున్నట్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ తగ్గింపు రూ. 50 నుంచి రూ. 1350 వరకు ఉండనుంది. మీడియం, ప్రీమియంలో 25 శాతం ధరలను తగ్గించింది. అయితే బీర్లు, రెడీ టు డ్రింక్ మద్యం ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

రూ. 200లోపు క్వార్టర్ బాటిల్ ధరల్లో కూడా మార్పు ఉండదని ప్రభుత్వం తెలిపింది. రూ. 200ల పైన క్వార్టర్ ధర ఉన్న మద్యం రేటు మాత్రమే తగ్గనుంది. బాటిళ్ల పరిమాణాలు, బ్రాండ్లను బట్టి 90 ఎంఎల్ నుంచి లీటర్ వరకు రూ. 50 నుంచి రూ. 1350 వరకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తగ్గిన ధరలు రేపటి నుంచి అమలు కానున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యాన్ని అరికట్టేందుకే ధరలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.


More Telugu News