జాతీయ స్థాయిలో పరువు కాపాడాలంటూ ఒక పత్రికతో ఒప్పందమా?: దేవినేని ఉమ
- ప్రభుత్వం, ప్రభుత్వ నేతల ప్రతిష్ఠ కాపాడేలా కథనాల ప్రచురణ
- మీ భజనకోసం 8.15 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు
- సమాచారశాఖ దగ్గర నిధులు లేకపోయినా మంజూరు
- పేరు ప్రతిష్ఠలు చేసే పనులవల్ల వస్తాయి, కొనుక్కుంటే కాదు
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఇమేజ్‌ను భారీగా బిల్డప్ చేసేందుకు ఓ జాతీయ దినపత్రికతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఇందుకు 8.15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని రాష్ట్ర సమాచార ప్రసార శాఖ నిన్న ప్రత్యేక జీవో జారీ చేయడంతో తెలిసిందని అందులో పేర్కొన్నారు. జగన్ సర్కారు పేరు, ప్రతిష్ఠలను కొనుగోలు చేస్తోందంటూ అందులో పేర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు.
‘జాతీయ స్థాయిలో పరువు కాపాడాలంటూ ఒక పత్రికతో ఒప్పందమా? ప్రభుత్వం, ప్రభుత్వ నేతల ప్రతిష్ఠ కాపాడేలా కథనాల ప్రచురణ. మీ భజనకోసం 8.15 కోట్ల రూపాయల ప్రజాధనం అవసరమా? సమాచారశాఖ దగ్గర నిధులు లేకపోయినా అదనపు నిధుల మంజూరు. పేరు ప్రతిష్ఠలు చేసే పనులవల్ల వస్తాయి కానీ కొనుక్కుంటే రావని తెలుసుకోండి వైఎస్ జగన్’ అని దేవినేని ఉమ చెప్పుకొచ్చారు.