మరో హాలీవుడ్ సినిమాలో ప్రియాంక చోప్రా
- 'క్వాంటికో' సీరీస్ నుంచి అంతర్జాతీయ గుర్తింపు
- 'టెక్స్ట్ ఫర్ యు' హాలీవుడ్ సినిమాకు సంతకం
- 'ఎస్ఎమ్ఎస్ ఫర్ డిచ్' జర్మన్ సినిమాకి రీమేక్
- తల్లి మధు చోప్రా, భర్త నిక్ జోనాస్ ల విషెస్
బాలీవుడ్ లో అగ్రతారగా రాణిస్తుండగానే హాలీవుడ్ కి వెళ్లి అమెరికన్ టీవీ సీరీస్ 'క్వాంటికో'లో నటించి అంతర్జాతీయంగా పేరుతెచ్చుకున్న నటి ప్రియాంక చోప్రా. ఇక అక్కడి నుంచి తిరిగిచూసుకోకుండా అక్కడే రాణిస్తోంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని తాజాగా తానే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
నాలుగేళ్ల క్రితం వచ్చిన జర్మన్ సినిమా 'ఎస్ఎమ్ఎస్ ఫర్ డిచ్'కి రీమేక్ గా రూపొందే అమెరికన్ సినిమాలో ప్రియాంక హీరోయిన్ గా నటించనుంది. దీనికి 'టెక్స్ట్ ఫర్ యు' అనే పేరుని తాత్కాలికంగా నిర్ణయించారు. ఇందులో శ్యామ్ హ్యూఘన్, సెలీన్ డియోన్ లతో కలసి ఆమె నటించనుంది. అలాగే దీనికి జిమ్ స్ట్రౌజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
దీని గురించి ఈ చిన్నది చెబుతూ, 'ఈ సినిమాలో నటించనున్నందుకు చాలా ఎగ్జయిట్ అవుతున్నాను. ఇది నాకొక ఆనర్..' అంటూ పేర్కొంది. ఈ సందర్భంగా ఆమెకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానుల నుంచి పలు విషెస్ అందుతున్నాయి. తల్లి మధు చోప్రా, భర్త నిక్ జోనాస్ కూడా ప్రియాంకను అభినందనల్లో ముంచెత్తారు.
ఇక ఈ సినిమా కథ లైన్ విషయానికి వస్తే, కథానాయిక త్వరలో పెళ్లి చేసుకోబోయే బాయ్ ఫ్రెండ్ ఓ ప్రమాదంలో మరణిస్తాడు. ఆ బాధ నుంచి కోలుకునే ప్రయత్నంలో భాగంగా, అతను ఇంకా ఉన్నట్టుగానే భావిస్తూ అతని మొబైల్ నెంబర్ కి ఎస్సెమ్మెస్ లు పంపుతుంటుంది. అయితే, ఇక్కడే చిన్న ట్విస్ట్ వుంది. అప్పటికే ఆ నెంబర్ని మరో యువకుడికి సదరు సంస్థ కేటాయిస్తుంది. ఈమె పంపే సందేశాలకి అతను స్పందిస్తుంటాడు. అలా ఆమె అతనికి కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి కథ ఆసక్తికరంగా సాగుతుంది.