మందసాగర్‌కు మరణ శిక్ష పడాలి: బాలుడు దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు
- ఈ నెల 31 వరకు పోలీసుల కస్టడీకి సాగర్
- మహబూబాబాద్‌లో మీడియాతో మాట్లాడిన దీక్షిత్ తల్లిదండ్రులు
- 300 మంది పోలీసులు గాలింపు చేపట్టినా ఫలితం దక్కలేదని ఆవేదన
మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో దీక్షిత్ రెడ్డి (9)ని మంద సాగర్ అనే యువకుడు కిడ్నాప్ చేసి దానవయ్య గుట్టకు తీసుకెళ్లి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు మంద సాగర్‌ను తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 27 నుంచి 31 వరకు కస్టడీలోకి తీసుకోవడానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో నిన్న పోలీసులు తమ కస్టడికి తీసుకున్నారు.
ఇదిలావుంచితే, దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు ఈ రోజు ఉదయం మహబూబాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తమ కుమారుడి కిడ్నాప్ అనంతరం బాలుడి ఆచూకీ కోసం 300 మంది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదని చెప్పారు. తమ కుమారుడు క్షేమంగా వస్తాడని ఎదురుచూశామని, కానీ, హత్యకు గురయ్యాడని చెబుతూ కన్నీటిపర్యంతం అయ్యారు. తమ కుమారుడిని హత్య చేసిన మంద సాగర్‌కు మరణశిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు.