సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • డ్రెస్ సెన్స్ గురించి చెప్పిన తమన్నా 
  • షూటింగులోకి దిగుతున్న బాలకృష్ణ
  • 'స్టార్ మా' చేతిలో రెండు భారీ సినిమాలు
*  'మన డ్రెస్సింగ్ మనకే అసౌకర్యంగా ఉంటే చాలా ఇబ్బందే' అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. 'ఫ్యాషన్ పేరుతో మనం ధరించే దుస్తులు ఎదుటివారికి కొత్తగా కనపడాలి.   అలాగే ధరించిన వాళ్లకి అసౌకర్యంగా వుండకూడదు. ఒక డ్రెస్ వేసుకుని మనం ఇబ్బంది పడుతున్నామంటే అది మన కాన్ఫిడెన్స్ ని కూడా దెబ్బతీస్తుంది. అందుకే ఇవన్నీ చూసుకునే డ్రెస్సింగ్ ఫాలో అవాలి' అని చెప్పింది తమన్నా.  
*  బాలకృష్ణ, బోయపాటి కలయికలో రూపొందుతున్న మూడో చిత్రం తాజా షెడ్యూలు షూటింగు రేపటి నుంచి హైదరాబాదులో జరుగుతుందని తెలుస్తోంది. హీరో బాలకృష్ణ కూడా రేపు జాయిన్ అవుతారని సమాచారం. లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రం షూటింగ్ చాలావరకు జరిగింది.
*  ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానెల్ 'స్టార్ మా' రెండు భారీ చిత్రాల శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. మహేశ్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట', అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' చిత్రాల హక్కులను భారీ రేటు ఆఫర్ చేసి స్టార్ మా దక్కించుకున్నట్టు తెలుస్తోంది.


More Telugu News