లగ్జరీ కార్ల తయారీదారు లాంబోర్ఘినీ ఏపీలో అడుగుపెడుతోంది: విజయసాయిరెడ్డి
- ఏపీలో మరో మెగా పెట్టుబడి అంటూ విజయసాయి ట్వీట్
- రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి లాంబోర్ఘినీ ఆసక్తి
- జగన్ నాయకత్వంపై విజయసాయి ప్రశంసలు
ఇటలీకి చెందిన విలాసవంతమైన స్పోర్ట్స్ కార్ల తయారీదారు లాంబోర్ఘినీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఏపీలో మరో మెగా పెట్టుబడి అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఏపీలో విద్యుత్ ఆధారిత వాహనాలు తయారుచేసేందుకు లాంబోర్ఘినీ ఆసక్తి చూపుతోందని, రూ.1,750 కోట్ల మేర పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉందని వివరించారు. భారత్ లో పెట్టుబడులకు అత్యంత అనువైన రాష్ట్రంగా ఏపీ పేరు తెచ్చుకుంటోందని, సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు పోతోందని కొనియాడారు.
లాంబోర్ఘినీ ఓ ప్రపంచస్థాయి కార్ల తయారీ దిగ్గజం. ఈ సంస్థ తయారుచేసిన పలు మోడళ్లు రూ.3 కోట్ల పైచిలుకు ధర పలుకుతున్నాయి. భారత్ లోనూ అనేకమంది సినీ స్టార్లు లాంబోర్ఘినీ కారు కొనడాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారంటే అతిశయోక్తి కాదు.