తన తొలి తమిళ సినిమా గురించి రష్మిక భావోద్వేగంతో పోస్ట్!
- రష్మిక తొలి తమిళ సినిమా 'సుల్తాన్'
- కార్తీ ఫస్ట్ లుక్ ని మెచ్చుకున్న రష్మిక
- చిన్నప్పుడు తమిళ సినిమాలు చూశానన్న భామ
- ఇదంతా నమ్మశక్యంగా లేదన్న ముద్దుగుమ్మ
టాలీవుడ్ హాట్ స్టార్ రష్మిక భావోద్వేగానికి గురైంది. తెలుగులో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా, బిజీ స్టార్ గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల తమిళంలో తొలిసారిగా ఓ చిత్రంలో నటించింది. ప్రముఖ నటుడు కార్తీ హీరోగా బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పేరు 'సుల్తాన్'. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అదే పేరుతో అనువదిస్తున్నారు. ఈ చిత్రం షూటింగును రష్మిక ఇటీవలే పూర్తిచేసింది.
ఇదిలావుంచితే, ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిన్న రిలీజ్ చేశారు. కార్తీ యాక్షన్ మోడ్ లో వున్న ఈ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. దీనిపై ఈ చిన్నది కూడా ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసింది.
ఆ తర్వాత ఈ సినిమా గురించి చెబుతూ, "నా తొలి తమిళ చిత్రమైన సుల్తాన్ గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పుడు నాన్నతో కలసి ఎన్నో తమిళ సినిమాలు చూశాను. ఇప్పుడు ఇలా ఓ పెద్ద తమిళ సినిమాలో.. అద్భుతమైన వ్యక్తులతో కలసి నటించానన్నా, పనిచేశానన్నా నమ్మశక్యంగా లేదు. అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను" అంటూ భావోద్వేగంతో పోస్ట్ పెట్టింది.
అన్నట్టు, రష్మిక ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన 'పుష్ప' సినిమాలోనూ, శర్వానంద్ కి జోడీగా 'ఆడాళ్లూ మీకు జోహార్లు' చిత్రంలోనూ కథానాయికగా నటిస్తోంది. మరికొన్ని ప్రాజక్టులు చర్చల దశలో వున్నాయి.