ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారత్ వెంటే అమెరికా: మైక్ పాంపియో స్పష్టీకరణ

  • భారత పర్యటనకు వచ్చిన అమెరికా మంత్రి
  • భారత్ కు దన్నుగా నిలుస్తామని హామీ
  • భాగస్వామ్యాన్ని మరింత పటిష్టపరుచుకుంటామని వెల్లడి
ఇటీవల లడఖ్ వద్ద గాల్వన్ లోయలో భారత, చైనా బలగాల మధ్య హింసాత్మక రీతిలో ఘర్షణలు జరిగిన నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో తమ వైఖరి కుండబద్దలు కొట్టారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారత్ కు తమ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. తాము భారత్ వైపేనని ఉద్ఘాటించారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలకు అమెరికా మద్దతుగా నిలుస్తుందని వెల్లడించారు. రెండు దేశాలు అనేక అంశాల్లో తమ భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నాయని తెలిపారు.

మైక్ పాంపియో, అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పర్ సోమవారం భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిరువురు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గాల్వన్ లోయలో చైనాతో ఘర్షణల్లో అమరులైన భారత జవాన్లకు నివాళులు అర్పించారు.


More Telugu News