రేపటి నుంచి ఈశాన్య రుతుపవనాల సీజన్ షురూ!
- నిన్నటితో ఏపీ నుంచి నిష్క్రమించిన నైరుతి
- వర్షాలతో ప్రవేశించనున్న ఈశాన్య రుతుపవనాలు
- రెండ్రోజుల పాటు వర్షాలు
ఏపీలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణం నిన్నటితో పూర్తయింది. భారీ వర్షాలు కురిపించిన నైరుతి సీజన్ ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈశాన్య రుతుపవనాలు రేపు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈశాన్య రుతుపవనాల రాకతో కోస్తాంధ్రలోనే కాక, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ వర్షాలు పడనున్నాయి.
ప్రస్తుతం బంగాళాఖాతం, దక్షిణ భారతదేశంపై దిగువ ట్రోపో ఆవరణం స్థాయిలో ఈశాన్య గాలులు ఏర్పడ్డాయని అధికారులు వివరించారు. అటు, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రెండ్రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. కాగా, నైరుతి రుతుపవనాలు రేపటితో దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించనున్నాయి.