రైతులకు ఏం సమాధానం చెబుతారు?: దేవినేని ఉమ

  • వారం, పది రోజులుగా నీటిలోనే పంటలు
  • నాని కుళ్లిపోయిన వరి, అరటి, బొప్పాయి
  • పూర్తిగా దెబ్బతిన్న వేరు శనగ, మిరప, పత్తి, కూరగాయ పంటలు
  • భారీగా నష్టపోయిన రైతులు  
ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో పంటలు నాశనమై రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ రైతు తమ బాధను చెప్పుకుంటుండగా తీసిన ఓ వీడియోను పోస్ట్ చేస్తూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. వారికి ఏం సమాధానం చెబుతారని ఏపీ సీఎం జగన్‌ను ప్రశ్నించారు.

‘వారం, పది రోజులుగా నీటిలోనే పంటలు.. నాని కుళ్లి పోయిన వరి, అరటి, బొప్పాయి.. పూర్తిగా దెబ్బతిన్న వేరు శనగ, మిరప, పత్తి, కూరగాయ పంటలు. భారీగా నష్టపోయి వేలాది రూపాయల పెట్టుబడులు నీటిపాలైనా రైతుల వైపు కన్నెత్తి చూడలేదు. అన్నదాతల గోడు వినే నాథుడు లేడంటున్న  రైతులకు ఏం సమాధానం చెప్తారు?’ అని దేవినేని ఉమ నిలదీశారు.


More Telugu News