థియేటర్లను తగులబెట్టే అవకాశం ఉంది: రాజమౌళికి ఎంపీ సోయం బాపూరావు హెచ్చరిక
- 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఎన్టీఆర్ లుక్‌పై వివాదం
- కొమరం భీమ్‌గా నటిస్తూ టకియాను ధరించడం పట్ల విమర్శలు
- టకియాను తొలగించాలని బాపూరావు డిమాండ్
- కించపరిస్తే ఊరుకోబోమని హెచ్చరిక
దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్ ను ఆ సినిమా యూనిట్ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో ముస్లిం వేషధారణలో ఎన్టీఆర్ కనపడిన లుక్‌పై బీజేపీ ఎంపీ సోయం బాపూరావు మండిపడ్డారు. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ధరించిన టకియాను తొలగించాలని ఆయన అన్నారు.
అలా కాదని సినిమా విడుదల చేస్తే ఈ సినిమా ఆడే థియేటర్లను తగుల బెట్టే అవకాశం ఉందని సోయం బాపూరావు హెచ్చరికలు చేశారు. సినిమా వసూళ్ల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే ఊరుకోబోమని చెప్పారు. నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడైన భీమ్‌ను చంపిన వాళ్ల టోపీని ఆ పాత్ర పోషిస్తున్న వ్యక్తికి పెట్టడం ఆదివాసులను అవమానించడమేనని మండిపడ్డారు. దర్శకుడు రాజమౌళి చరిత్రను తెలుసుకోవాలని ఆయన సూచించారు. భీమ్ పాత్రలో కనపడిన ఎన్టీఆర్ టకియాను ధరించడం పట్ల పలు ఆదివాసీ సంఘాలు కూడా మండిపడ్డ విషయం తెలిసిందే.