దుబ్బాకలో పోలీసుల తీరుపై బీజేపీ నేతల విమర్శలు
- బండి సంజయ్‌ను అరెస్టు చేసిన పోలీసులు
- పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నానన్న సుజనా చౌదరి
- జోయల్ పేరును గుర్తు పెట్టుకుంటానన్న ఎంపీ అరవింద్
దుబ్బాక ఉప ఎన్నిక వేళ చోటు చేసుకుంటోన్న రాజకీయ పరిణామాల మధ్య బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న సిద్ధిపేటకు బయల్దేరగా.ఆయనను పోలీసులు అరెస్టు చేసి కరీంనగర్ తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
‘బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారిపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాను. పార్లమెంటు సభ్యుడి గౌరవానికి భంగం కలిగే విధంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి’ అని బీజేపీ నేత సుజనా చౌదరి డిమాండ్ చేశారు.
కాగా, పోలీసుల తీరు పట్ల బీజేపీ నేత, ఎంపీ అరవింద్ మండిపడుతూ.. సీపీ జోయల్ డేవిస్ పోలీసా? లేక గూండానా? అని నిలదీశారు. జోయల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. తాను జోయల్ పేరును గుర్తు పెట్టుకుంటానంటూ హెచ్చరించారు.