ఒక్క ముస్లిం కోసం అంత పెద్ద శ్మశాన వాటిక ఎందుకు?: బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

  • బహిరంగ సభలో సాక్షి మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • జనాభా ప్రాతిపదికన శ్మశాన వాటికలు ఉండాలన్న ఎంపీ
  • మన ఓపికను ఎవరూ పరీక్షించవద్దని హెచ్చరిక
ఉత్తరప్రదేశ్‌లో ఏడు అసెంబ్లీ స్థానాలకు మరో వారం రోజుల్లో ఉప ఎన్నికలు జరగనున్న వేళ ఉన్నావో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులకు ఇరుకైన శ్మశాన వాటికలుంటే, ముస్లింలకు మాత్రం విశాలమైన శ్మశాన వాటికలు ఉన్నాయని, ఇది పూర్తిగా వివక్షేనని అన్నారు. ఉన్నావో బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్ కటియార్‌కు మద్దతుగా నిన్న నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు.

జనాభా ప్రాతిపదికన మాత్రమే శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలన్నారు. ‘‘ఒకే ఒక్క ముస్లిం ఉన్నా వారి శ్మశాన వాటిక మాత్రం చాలా పెద్దగా ఉంటోంది. మీరు (హిందువులు) మాత్రం మీ ఆత్మీయులకు పొలాల పక్కన దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇదెక్కిడి న్యాయం?’’ అని ప్రశ్నించారు. ఇక ఉపేక్షించలేమని, ఎవరూ మన ఓపికను పరీక్షించకూడదని సాక్షి మహరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News