ఆస్ట్రేలియా టూర్ కు టీమిండియా ఎంపిక... రోహిత్ శర్మకు దక్కని చోటు
- కోహ్లీ కెప్టెన్సీలో మూడు ఫార్మాట్లకు వేర్వేరు జట్లు
- టీ20, వన్డేల్లో కేఎల్ రాహుల్ కు వైస్ కెప్టెన్సీ
- టీ20 జట్టులో వరుణ్ చక్రవర్తికి చోటు
- జట్టుతో పాటు ఆస్ట్రేలియా వెళ్లనున్న అదనపు బౌలర్లు
సుదీర్ఘమైన ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమిండియాను ఎంపిక చేశారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మూడు ఫార్మాట్లకు విడిగా జట్లను ప్రకటించారు. ఐపీఎల్ లో గాయపడిన రోహిత్ శర్మకు ఆసీస్ బెర్తు దక్కలేదు. ఐపీఎల్ తాజా సీజన్ లో విశేషంగా రాణిస్తున్న వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ కు ప్రమోషన్ లభించింది. టీ20, వన్డే ఫార్మాట్లలో భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా రాహుల్ ను నియమించారు.
అంతేకాదు, ఈ ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న తమిళనాడు కుర్రాడు వరుణ్ చక్రవర్తి టీమిండియాలో స్థానం సంపాదించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న వరుణ్ చక్రవర్తి ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో ఐదు వికెట్ల ప్రదర్శనతో బీసీసీఐ సెలెక్టర్లను మెప్పించాడు.
టీమిండియా టీ20 స్క్వాడ్
విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, దీపక్ చహర్, వరుణ్ చక్రవర్తి.
టీమిండియా వన్డే స్క్వాడ్
విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్ మాన్ గిల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్.
టీమిండియా టెస్టు స్క్వాడ్
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), హనుమ విహారి, శుభ్ మాన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్.
నలుగురు అదనపు బౌలర్లు కూడా జట్టుతో పాటు ఆస్ట్రేలియా వెళతారు. కమలేశ్ నాగర్ కోటి, కార్తీక్ త్యాగి, ఇషాన్ పోరెల్, నటరాజన్ లకు ఈ అవకాశం దక్కింది.