ఏపీలో అక్రమ మద్యానికి కళ్లెం... జీవో 310 తీసుకువచ్చిన సర్కారు
- పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి అక్రమ మద్యం
- ఇప్పటివరకు మూడు బాటిళ్ల నిబంధన
- ఇకపై నిబంధనలు మరింత కఠినతరం
ఏపీలో క్రమంగా మద్య నిషేధం విధించాలని వైసీపీ సర్కారు తలపోస్తోంది. అయితే పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలో మద్యం అక్రమ రవాణా అవుతున్న నేపథ్యంలో నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది. ఈ క్రమంలో అక్రమ మద్యానికి కళ్లెం వేసేలా జీవో 310 తీసుకువచ్చారు. ఇకపై లైసెన్సులు, పర్మిట్లు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావడం కుదరదు.
ఇప్పటివరకు మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకునే వీలుండేది. కొత్త జీవో రాకతో ఇకపై మూడు బాటిళ్లు తెచ్చుకోవడం కూడా సాధ్యం కాదు. అయితే, ఇతర దేశాల నుంచి తీసుకువచ్చే మద్యంపై కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అమల్లో ఉన్నందున తాము ఆ నిబంధనలను గౌరవిస్తామని, విదేశాల నుంచి రాష్ట్రానికి తీసుకువచ్చే మద్యాన్ని నిబంధనల మేరకు అనుమతిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తన జీవోలో పేర్కొంది.