సల్కం చెరువులో ఆక్రమణలు తొలగించే దమ్ము సీఎం కార్యాలయానికి ఉందా?: దాసోజు శ్రవణ్

  • టీఆర్ఎస్ వచ్చాక ఆక్రమణలు పెరిగాయన్న శ్రవణ్
  • రాజకీయ మైత్రి కారణంగా అక్రమ నిర్మాణాలు అంటూ ఆరోపణ
  • ఒవైసీ స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ పై ఆరోపణలు
తెలంగాణ ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణకు వీలు కల్పించే ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకువచ్చిన నేపథ్యంలో ఆక్రమిత భూముల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తాజాగా ట్విట్టర్ లో స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చెరువులను కబ్జా చేయడం అధికమైందని ఆరోపించారు.

2014లో బండ్లగూడలోని సల్కం చెరువులో ఒవైసీ స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కు చెందిన ఎలాంటి భవనాలు లేవని, కానీ 2015లో రాజకీయ మైత్రి కారణంగా ఆక్రమణలు చోటు చేసుకున్నాయని వివరించారు. సల్కం చెరువును ఆక్రమణల నుంచి రక్షించే క్రమంలో అక్రమ నిర్మాణాలను తొలగించే దమ్ము  తెలంగాణ సీఎం కార్యాలయానికి ఉందా? అని శ్రవణ్ ప్రశ్నించారు.


More Telugu News