అమరావతిలో 9 వేల ఎకరాలు అభివృద్ధి చేయాల్సి ఉన్నా చంద్రబాబు పట్టించుకోలేదు: సోము వీర్రాజు

  • అమరావతిపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్
  • అమరావతిపై బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందన్న సోము
  • రాజధానిపై టీడీపీ, వైసీపీ ప్రజలను మోసం చేశాయని విమర్శలు
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ అమరావతి అంశంపై స్పందించారు. అమరావతి విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందని అన్నారు. అమరావతిలో 9 వేల ఎకరాలు అభివృద్ధి చేయాల్సి ఉన్నా, చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ ప్రజల్ని మోసం చేశాయని ఆరోపించారు. రాజధానికి కేంద్రం కేటాయించిన నిధులు లెక్కచెప్పాలని ప్రశ్నించారు.

తమకు రాజకీయాలు ముఖ్యం కాదని, రాష్ట్రాభివృద్ధే ముఖ్యమని సోము వీర్రాజు స్పష్టం చేశారు. టీటీడీ నుంచి డిపాజిట్ డబ్బులు తీయొద్దంటూ ప్రభుత్వానికి లేఖ రాశామని వెల్లడించారు. 21 కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులపై అధ్యయనం చేసి వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల అవినీతిని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. పోలవరం విషయంలో వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని అన్నారు.


More Telugu News