బొగ్గు కుంభకోణం కేసు: కేంద్ర మాజీ మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష ఖరారు
- బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ కోర్టు ఇటీవల తీర్పు
- దిలీప్ రేతో పాటు మరో ముగ్గురిని దోషులుగా తేల్చిన కోర్టు
- నేడు శిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం
- 1999లో ఝార్ఖండ్‌లో బొగ్గు కేటాయింపుల్లో అక్రమాలు
బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల తీర్పు వెల్లడించి, ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేతో పాటు మరో ముగ్గురిని దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. 1999లో ఝార్ఖండ్‌లో బొగ్గు కేటాయింపుల్లో వారు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సుదీర్ఘ విచారణ కొనసాగిన అనంతరం ఈ తీర్పు వచ్చింది.
ఝార్ఖండ్‌లోని గిరిధిలో ఉన్న బ్రహ్మదిహ బొగ్గు గనులను కాస్ట్రాన్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు కేటాయించగా, ఇందులో అవినీతి జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో ఇందులో దిలీప్ రేను కూడా దోషిగా కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు శిక్షను ఖరారు చేసింది. దిలీప్ రేతో పాటు మరో ఇద్దరు దోషులకు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే, రూ.10 లక్షల చొప్పున జరిమానా కూడా విధించింది. మరోవైపు, క్యాస్ట్రన్ టెక్‌కు రూ.60లక్షలు, క్యాస్ట్రన్ మైనింగ్ లిమిటెడ్‌కు మరో రూ.10 లక్షల అదనపు జరిమానా విదిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.