అజిత్ ధోవల్ చేసిన వ్యాఖ్యలు చైనా గురించి కాదు: కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
- రిషికేశ్ లోని ఆశ్రమంలో ధోవల్ ప్రసంగం
- మనకు ముప్పు తలపెట్టే వారిపై దాడి చేస్తామని వ్యాఖ్య
- చైనా గురించే వ్యాఖ్యానించారని ప్రచారం
రిషికేష్ లోని ఒక ఆశ్రమంలో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. చైనాను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున చర్చ తెరపైకి రావడంతో కేంద్రం కలగజేసుకుంది. ఆధ్యాత్మిక ధోరణితో తన వ్యక్తిగత అభిప్రాయాలను మాత్రమే ధోవల్ చెప్పారని కేంద్రం తెలిపింది. ఏ ఒక్క దేశాన్ని ఉద్దేశించి ధోవల్ వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చింది.
వివాదం వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 24న రిషికేశ్ లోని పరమార్థ నికేతన్ ఆశ్రమంలో భక్తులను ఉద్దేశించి అజిత్ ధోవల్ మాట్లాడుతూ, భారతదేశ ఆధ్యాత్మికత గొప్పదనం గురించి చెప్పారు. ఏ దేశంపై కూడా మనం దాడి చేయలేదనే విషయం అందరికీ తెలుసని... కానీ, ఏ దేశం నుంచైనా మనకు ముప్పు పొంచి ఉంటే మాత్రం ... మనం తప్పకుండా దాడి చేస్తామని చెప్పారు. మన దేశాన్ని కాపాడుకోవడానికి ఈ పని చేయాల్సిందేనని అన్నారు.
ధోవల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టించాయి. లడఖ్ విషయంలో చైనాను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వార్తలు వచ్చాయి. దీంతో, కేంద్రం దీనిపై క్లారిటీ ఇచ్చింది. కేవలం ఆధ్యాత్మిక ధోరణితోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని, ఎవరినీ ఉద్దేశించి చేసినవి కావని తెలిపింది.