దేవరగట్టు కర్రల సమరంపై ఉత్కంఠ.. పలు మండలాల్లో 144 సెక్షన్ విధింపు

  • ఈ నెల 21 నుంచి 30 వరకు బన్సీ ఉత్సవాలు
  • కర్రల సమరంపై పోలీసుల నిషేధం
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న పోలీసులు
కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాలను పోలీసులు నిషేధించారు. ఆలూరు, హొలగొంద, ఆస్పరి మండలాల్లో 144 సెక్షన్ విధించారు. పూజా కార్యక్రమాలు మాత్రం యథావిధిగానే జరుగుతాయన్న పోలీసులు.. పండుగను అందరూ ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

దసరా సందర్భంగా దేవరగట్టులో జరిగే బన్సీ ఉత్సవం చాలా ప్రత్యేకమైనది. రణరంగాన్ని తలపించేలా జరిగే ఈ ఉత్సవంలో ప్రజలు ఒకరినొకరు కర్రలతో బాదుకుంటారు. ఫలితంగా చాలామంది తలలు పగిలి తీవ్ర గాయాలపాలవుతారు. ఆ ప్రాంతమంతా రక్తంతో తడిసిముద్దవుతుంది. ఈ నెల 21 నుంచి 30 వరకు బన్సీ ఉత్సవాలను నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్ణయించినప్పటికీ అందులో భాగంగా నిర్వహించే కర్రల సమరంపై పోలీసులు ఈసారి నిషేధం విధించడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.


More Telugu News